Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిద్ధిపేటకు వచ్చిన 90 టైర్ల లారీ!

  • భారీ యంత్రాన్ని మోసుకెళుతున్న వాహనం
  • మధ్యప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు
  • ఆసక్తిగా తిలకించిన ప్రజలు
అధి భారీ యంత్రాలను మోసుకెళ్లే అతి భారీ వాహనం. ఏకంగా 90 టైర్లతో ఉన్న లారీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టు పనులకు అవసరమైన సామాగ్రిని తెస్తోంది. ఇంత భారీ వాహనాలు రోడ్డుపై నెమ్మదిగా కదులుతూ ఉంటే ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

మధ్యప్రదేశ్ లో తయారైన ఈ యంత్రాలను తెలంగాణ మీదుగా ఏపీకి తరలిస్తున్న వేళ, ఇవి సిద్ధిపేట సమీపంలోని రంగధాంపల్లి మీదుగా వెళుతూ ఆగాయి. కుడి ఎడమవైపుల్లో 40 చొప్పున 80 టైర్లు, ముందు ఇంజన్ కు 10 టైర్లతో ఉన్న ఈ వాహనం అందరినీ ఆకర్షించింది.
Lorry
90 Tyres
Andhra Pradesh
Madhya Pradesh
Telangana

More Telugu News